Allu Sneha: అరుదైన రికార్డు అందుకున్న అల్లు అర్జున్ భార్య

Allu Sneha: అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య ఏకంగా 4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌తో స‌రికొత్త రికార్డు సృష్టించారు.

Kranthi
Published on: 18 Jun 2021 7:31 AM IST
Allu Arjun Wife Allu Sneha Set New Record in Instagram Followers
X

Allu Arjun, Sneha:(File Image)

Allu Sneha: సినీతారల ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా క్రేజీగా ఉంటుంది. తమ అభిమాన నటుడు తమ ఇంట్లో మనిషన్నట్లే ఫీలయిపోతారు ఫ్యాన్స్. అందుకే చీమ చిటుక్కుమన్నా సరే చటుక్కున సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తారు అభిమానులు. సోషల్ మీడియాలో తారల పాలోయింగ్ ను బట్టి.. ఎవరి క్రేజ్ ఎంతో అనేది లెక్కలేస్తున్నారు ఈ మధ్య. ఇప్పుడు అది వారికే కాక.. వారి భార్యల అకౌంట్లను కూడా ఫాలో అవుతూ.. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్టుగా బన్నీ అల్లు అర్జున్ భార్య స్నేహకు కూడా రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ వచ్చారు.

అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య ఏకంగా 4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌తో స‌రికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్ హీరోల భార్య‌ల‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న వారిలో స్నేహ మొద‌టి స్థానంలో నిలిచారు. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన 3.3 మిలియన్‌ ఫాలోయర్స్‌ని, సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ 2 మిలియన్‌ ఫాలోయర్స్‌ ను కలిగి ఉన్నారు.

Kranthi

Kranthi

Next Story