logo

బరువు తగ్గనున్న బన్నీ

బరువు తగ్గనున్న బన్నీ
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా డిజాస్టర్ తర్వాత చాలాకాలం ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్లో ఉంచి టాలీవుడ్...

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా డిజాస్టర్ తర్వాత చాలాకాలం ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్లో ఉంచి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. దాదాపు పది నెలల పాటు బన్నీ షూటింగ్ చేయకుండా ఉండటం తన కెరీర్ లోనే మొదటిసారి. అయితే ఒకవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ను తీర్చి దిద్దడంలో బిజీగా ఉండటం తో అల్లు అర్జున్ కూడా అతని పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ కి కొన్నాళ్ళు దూరంగా ఉండటం తో బన్నీ ఫిట్నెస్ లెవెల్స్ తగ్గాయని సమాచారం

అందుకే ప్రస్తుతం తన ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్. వర్కౌట్లు చేస్తూ బన్నీ బరువు తగ్గించే ప్రయత్నాలలో నిమగ్నమయ్యాడు. ప్రతి సినిమాకి కొత్త స్టైల్ లో కనిపించే బన్నీ ఈ సినిమాలో కూడా సరికొత్త అవతారంలో ప్రేక్షకులను మెప్పించనున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం బోలెడు మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి అలా ఫ్యాన్స్ కి ఈ సినిమా ద్వారా సరికొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు బన్నీ.

లైవ్ టీవి

Share it
Top