Allu Arjun: 'అర్జున్ రెడ్డి' తొలి ఛాయిస్ అల్లు అర్జున్.. కానీ: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..!

Arjun Reddy: సందీప్‌ వంగా డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ ఘన విజయంతో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే.

Shekhar G
Published on: 6 Jan 2024 1:02 PM IST
Allu Arjun Was The First Choice For The Role Of Arjun Reddy Says Sandeep Vanga
X

Allu Arjun: 'అర్జున్ రెడ్డి' తొలి ఛాయిస్ అల్లు అర్జున్.. కానీ: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..!

Arjun Reddy: సందీప్‌ వంగా డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ ఘన విజయంతో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సందీప్ వంగా యానిమల్ సినిమాతో మరో హిట్ దక్కించుకున్నాడు. అయితే, ఈ క్రమంలో అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేసి, వార్తల్లో నిలిచాడు. అర్జున్ రెడ్డి సినిమాకు ముందుగా అల్లు అర్జున్‌తో (Allu Arjun) తీయాలని అనుకున్నట్లు ప్రకటించాడు.

సందీప్ వంగా మాట్లాడుతూ.. ‘‘2011లో ఓ కథ అల్లు అర్జున్‌కు వినిపించాను. కానీ, అది కొన్ని కారణాల వల్ల అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమా స్టోరీని తయారు చేశాను. అర్జున్ రెడ్డి కథను అల్లు అర్జున్‌కు వినిపించాలని అనుకున్నా. కానీ, అదీ కుదరలేదు. అర్జున్ రెడ్డి స్క్రిప్ట్‌తో ఎంతోమంది నటులు, నిర్మాతలను మీట్ అయ్యాను. అయితే, చివరకు అర్జున్ రెడ్డి సినిమాను నేనే నిర్మించాలని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో విజయ్‌ దేవరకొండ ఓ స్నేహితుడి ద్వారా నాకు పరిచయం అయ్యాడు. దీంతో విజయ్‌తోనే అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాను. అయితే, 13 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్‌తో పనిచేసే అవకాశం దక్కింది.’’ అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా, సందీప్‌ వంగా ప్రస్తుతం ‘స్పిరిట్‌’ సినిమాతో బిజీగా మారాడు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా తీయనున్నాడు.

Shekhar G

Shekhar G

Next Story