Allu Arjun: ఎన్టీఆర్ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్న బన్నీ

Allu Arjun: ఎన్టీఆర్ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్న బన్నీ

Arun Chilukuri
Published on: 23 Nov 2022 2:56 PM IST
Allu Arjun Asking to Re-Work NTRs Oosaravelli Movie
X

Allu Arjun: ఎన్టీఆర్ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్న బన్నీ

Allu Arjun: ప్రముఖ స్టోరీ రైటర్ వక్కంతం వంశీ కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించారు. 2018 లో అల్లు అర్జున్ హీరోగా "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమాతో దర్శకుడిగా కూడా మారారు. కానీ ఆ సినిమాతో అంతగా మెప్పించలేకపోయారు. ప్రస్తుతం అఖిల్ "ఏజెంట్" సినిమాకి కథను అందిస్తున్న వక్కంతం వంశీ మరోవైపు నితిన్ హీరోగా ఒక సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

తాజాగా ఆలీతో సరదాగా కి గెస్ట్ గా విచ్చేసిన వక్కంతం వంశీ తన సినీ జర్నీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ గురించి కూడా రియాక్ట్ అయ్యారు వక్కంతం వంశీ. మీరు రాసిన ఒక కథని అల్లు అర్జున్ మళ్లీ రివర్స్ చేసి సినిమా చేయాలని అనుకుంటున్నారట అని అలి అడగగా పక్కంతం వంశీ దానికి అవునని అన్నారు. "నా కథల్లో ఆయనకు రెండు కథలు చాలా ఇష్టం. బాడ్ లక్ ఏంటంటే ఆ రెండు కథలు ఫ్లాప్ సినిమాలే. ఆయన చేసిన సినిమాలు కాదు ఒకటి ఊసరవెల్లి. రెండోది "కిక్ 2".

ఇలాంటి యూనిట్ పాయింట్స్ చాలా తక్కువగా దొరుకుతాయి. వాటిని ఎలాగైనా మనం వర్క్ అవుట్ చేసుకుని తీరాలి అని అంటూ ఉంటారు. ఇక ఊసరవెల్లి సినిమా అయితే తనకి చాలా ఇష్టం. దాని పై రీ వర్క్ చేసి మళ్ళీ ఏదో ఒక రోజు సినిమా చేయాలని ఉంది అంటారు. ఊసరవెల్లి కథ నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సినిమా కథ పై మళ్ళీ కథపై రీ వర్క్ చేసి తమిళ్లో అయినా రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించేవాడు," అని అన్నారు వక్కంతం వంశీ. మరి నిజంగానే బన్నీ ఊసరవెల్లి సినిమాని రీమేక్ చేస్తారా లేదా వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story