Allu Arjun: బోయపాటి సినిమాని బ్యాకప్ గా పెట్టుకున్న బన్నీ

Allu Arjun: ఐకాన్ లేకపోతే బోయపాటితో సినిమా అంటున్న అల్లు అర్జున్

admin1
Published on: 2 Sept 2021 2:11 PM IST
Allu Arjun Upcoming Movie With Director Boyapati Srinu
X
బోయపాటి తో సినిమా చేయనున్న అల్లము అర్జున్ (ఫైల్ ఇమేజ్)

Allu Arjun: ఈ మధ్యనే "అల వైకుంఠ పురం లో" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. "ఆర్య", "ఆర్య 2" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మూడో సినిమా ఇది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే "పుష్ప" రెండవ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించనున్నాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు బోయపాటి శ్రీను ఎప్పటినుంచో బన్నీతో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కు బోయపాటితో సినిమా చేసే తీరిక దొరకటం లేదు. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను సినిమాని బ్యాకప్ గా పెట్టుకున్నారు అల్లు అర్జున్. ఒకవేళ పరశురామ్ దర్శకత్వంలో బన్నీ చేయాల్సిన "ఐకాన్" సినిమా పట్టాలేక్కకపోతే అల్లు అర్జున్ వెంటనే బోయపాటి శ్రీను సినిమా ని మొదలు పెట్టబోతున్నారట. అయితే ఇది కేవలం "ఐకాన్" సినిమా మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని సమాచారం. ఇప్పటికే బన్నీ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో విడుదలైన "సరైనోడు" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story