మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ చేయనున్న స్టార్ దర్శకుడు

మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ చేయనున్న స్టార్ దర్శకుడు
x
Highlights

సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లను ఫాలో అయ్యే దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. తన సినిమాల టైటిల్స్ విషయంలో 'అ' సెంటిమెంట్ ను ఫాలో...

సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లను ఫాలో అయ్యే దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. తన సినిమాల టైటిల్స్ విషయంలో 'అ' సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలు అన్నీ 'అ' అనే అక్షరంతో మొదలయ్యాయి. 'అజ్ఞాతవాసి' సినిమా డిజాస్టర్ గా మారినప్పటికీ త్రివిక్రమ్ 'అ' అనే అక్షరంతో పెట్టిన 'అతడు', 'అరవింద సమేత', 'అత్తారింటికి దారేది' వంటి సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అదే 'అ' సెంటిమెంటును త్రివిక్రమ్ బన్నీ సినిమా లో కూడా ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

నిన్నటి నుండి బన్నీ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న ఈ సినిమాలోని ఒక ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేసినట్లు సమాచారం. అయితే త్రివిక్రమ్ ముందు సినిమా 'అరవింద సమేత' విషయంలో కూడా మొదట ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. అందుకనే త్రివిక్రమ్ అ సెంటిమెంట్ ను ఇక్కడ కూడా వాడుతున్నారు అని పుకార్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు అలకనంద అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బేగంపేట పోలీస్ లైన్స్ లో జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories