Allu arjun: షారుక్‌ 'జవాన్‌'లో అల్లు అర్జున్‌.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..

Allu Arjun: ఈ మధ్యనే "పఠాన్" సినిమాతో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మర్చిపోలేని సక్సెస్ ను అందుకున్నారు.

Arun Chilukuri
Updated on: 14 Feb 2023 8:30 PM IST
Allu Arjun To Star In Shah Rukh Khan And Atlees Jawan Movie
X

Allu arjun: షారుక్‌ ‘జవాన్‌’లో అల్లు అర్జున్‌.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..

Allu Arjun: ఈ మధ్యనే "పఠాన్" సినిమాతో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మర్చిపోలేని సక్సెస్ ను అందుకున్నారు. తాజాగా ఇప్పుడు షారుక్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. "జవాన్" అనే ఆసక్తికరమైన టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో షారుక్ ఖాన్ నయనతార ఇంటికి కూడా వెళ్లారట.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఇరు ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. "జవాన్" సినిమాలో బన్నీ ఒక ముఖ్య అతిథి పాత్రలో కనిపించబోతున్నారని ఈ పాత్ర కోసం ఈ మధ్యనే చిత్ర బృందం బన్నీని సంప్రదించగా బన్నీ కూడా ఓకే అన్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ ప్రజెన్స్ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడ లేదు. త్వరలోనే చిత్ర బృందం దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు "పుష్ప" సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీలో కూడా బ్లాక్ బస్టర్ ని అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప: ది రూల్" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story