Allu Arjun: కరోనా నుంచి కోలుకున్నాను.. అల్లు అర్జున్

Allu Arjun: తాజాగా జరిగిన పరీక్షలో కరోనా నెగిటివ్ వచ్చిందని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు

Kranthi
Updated on: 12 May 2021 12:10 PM IST
Allu Arjun Tests Negative for Corona
X

అల్లు అర్జున్ (ఫైల్ ఇమేజ్)

Allu Arjun: యంగ్ హీరో అల్లు అర్జున్ తన అభిమానులకు శుభవార్త అందించారు. తాజాగా జరిగిన పరీక్షలో కరోనా నెగిటివ్ వచ్చిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. 'ప్రతి ఒక్క‌రికీ హాయ్‌.. 15 రోజుల క్వారంటైన్ తర్వాత నాకు క‌రోనా నెగెటివ్ నిర్ధార‌ణ అయింది. నేను కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన‌ నా శ్రేయోభిలాషుల‌కు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. క‌రోనా కేసులు త‌గ్గ‌డానికి ఈ లాక్‌డౌన్ ఉపయోగ‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను. అంద‌రూ సుర‌క్షితంగా ఇంట్లోనే ఉండండి. మీరు చూపిస్తోన్న ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని బ‌న్నీ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్‌కు రెండు వారాల క్రితం క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి క్వారంటైన్‌లో ఉంటూ ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు. త‌న‌కు నెగెటివ్ నిర్ధార‌ణ అయిందంటూ బ‌న్నీ ఈ రోజు ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ లాక్‌డౌన్ వ‌ల్ల కేసులు త‌గ్గుతాయ‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు.


Kranthi

Kranthi

Next Story