Allu Arjun: 'పవన్ కల్యాణ్‌కే నా ప్రేమ, నా మద్దతు'...

Allu Arjun: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది.

Arun Chilukuri
Updated on: 9 May 2024 7:16 PM IST
Allu Arjun Support to Pawan Kalyan
X

Allu Arjun: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పలుసార్లు పిఠాపురంలో పర్యటించారు పవన్. ఇక జనసేన అధినేతకు మద్దతుగా మెగా ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ తదితరులు పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. పిఠాపురం ప్రజలు పవన్‌ను గెలపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పవన్‌కు మద్దతు తెలిపారు. ఆయన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌పెట్టారు. ఎన్నికల ప్రయాణంలో మీరు విజయం సాధించాలి . మీరు ఎంచుకున్న మార్గం చూసి నేనెప్పుడు గర్వపడతాను. ప్రజాసేవకు అంకితమవ్వాలన్న మీ నిర్ణయం గర్వకారణమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను అని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story