Allu Arjun: పుష్ప విడుదల కోసం వివాదాలకి దూరంగా ఉంటున్న అల్లు అర్జున్

Allu Arjun: వివాదాలు వద్దు అనుకుంటున్న బన్నీ

admin1
Updated on: 2 Nov 2021 3:30 PM IST
Allu Arjun Stays Away From Controversies for - Pushpa Part 1 Movie Release | Tollywood News
X

పుష్ప విడుదల కోసం వివాదాలకు దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ (ఫైల్ ఇమేజ్)

Allu Arjun - Pushpa Part 1 Movie Release: వివాదాలకి ఎప్పుడు దగ్గరగా ఉండే మెగా హీరోలలో అల్లుఅర్జున్ కూడా ఒకరు. త్వరలో తన సినిమా విడుదల ఉన్నప్పటికీ బన్నీ వివాదాలకి భయపడరు. కొన్నిసార్లు కావాలనే వివాదాల్లో ఇరుక్కున్నారా అనిపించేటట్లు ప్రవర్తిస్తుంటారు. గతంలో కూడా "సైరా" ట్రైలర్ గురించి ట్వీట్ చేయకుండా ఒక రెండు రోజుల పాటు అభిమానులను కంగారు పెట్టారు.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం అల్లు అర్జున్ పుష్ప విషయంలో చాలా జాగ్రత్త గా ఉన్నట్లు అనిపిస్తుంది. "పుష్ప పార్ట్ వన్" సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వివాదాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

"ఆర్ ఆర్ ఆర్" ఫస్ట్ ఫిలిమ్స్ గురించి ట్వీట్ చేస్తూ రామ్ చరణ్ ని బ్రదర్ అని ఎన్టీఆర్ ని బావ అని సంబోధించారు. రాజమౌళిపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఈమధ్య విడుదలైన దాదాపు చాలా సినిమాలను బన్నీ స్వయంగా ప్రమోట్ చేశారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వరుడు కావలెను, పుష్పకవిమానం సినిమాలని అల్లు అర్జున్ ప్రమోట్ చేశారు. ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" సినిమా ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం పుష్ప త్వరలోనే విడుదల కాబోతుందని అందుకే ఎటువంటి వివాదాల్లో ఇరుక్కో కూడదని బన్నీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story