Allu Arjun: మరో కొత్త వ్యాపారంలోకి స్టైలిష్‌ స్టార్‌...

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది.

admin1
Published on: 13 Jan 2022 5:19 PM IST
Allu Arjun set to Launch ‘AA’ Brand Soon
X

Allu Arjun: మరో కొత్త వ్యాపారంలోకి స్టైలిష్‌ స్టార్‌...

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. "అల వైకుంఠ పురం లో" సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు "పుష్ప: ది రైజ్" తో మరొక బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. కలెక్షన్లు, రికార్డుల విషయంలో తగ్గేదే లేదు అంటూ విడుదలైన రోజు నుంచి అదే జోరు కనబరుస్తున్నారు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ స్టైల్ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ తనకంటూ స్పెషల్ గా కస్టమైజ్ చేసుకున్న బట్టలను మాత్రమే వేసుకునే అల్లు అర్జున్ తన బట్టలకి ఏఏ లోగో ఉండేలాగా చూసుకుంటాడు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏఏ ని యొక్క బ్రాండ్ గా మార్చాలి అని అనుకుంటున్నారు అల్లు అర్జున్. నిజానికి అల్లు అర్జున్ వేసుకునే స్టైలిష్ బట్టలు ప్యారిస్, దుబాయ్ వంటి దేశాల్లో బాగా అమ్ముడవుతాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ ఇప్పుడు తన బ్రాండెడ్ బట్టల ని రంగంలోకి దింపుతున్నాడు. కొన్ని బ్రాండింగ్ ఏజెన్సీలు మరియు ఇన్వెస్టర్లు కూడా ఈ బ్రాండ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కరోనా కారణంగా పనులు కొంచెం వాయిదా పడేలా గా కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బన్నీ మాత్రం తన పేరు మీద ఒక బ్రాండ్ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పరిస్థితులు చక్కబడ్డాక అయినా సరే ఆ బ్రాండ్ విడుదల చేసేలా కనిపిస్తున్నారు.

admin1

admin1

Next Story