Allu Arjun: మీడియాకి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్

* బెంగుళూరులోని "పుష్ప" సినిమా ప్రెస్ మీట్ కి ఆలస్యంగా వచ్చిన అల్లు అర్జున్

Sandeep Reddy
Published on: 15 Dec 2021 6:37 PM IST
Allu Arjun Says Sorry to Media for Attended Late for Pushpa Movie Press Meet in Bangalore
X

Allu Arjun: మీడియాకి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్(ట్విట్టర్ ఫోటో)

Allu Arjun: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మంధన జంటగా నటించిన "పుష్ప" చిత్రం డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే సినిమా ఫైనల్ కాపీ కోసం చెన్నైలో దర్శకుడు సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ నిమగ్నమై ఉండగా.., మరోపక్క "పుష్ప" సినిమా ప్రమోషన్ లో అల్లు అర్జున్ బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే బెంగుళూరులో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ కి చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వచ్చినందుకు అల్లు అర్జున్ ని ఒక జర్నలిస్టు ప్రశ్నించాడు.

ఉదయం 11:15 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పారు. మీరు మధ్యాహ్నం 1:15 గంటలకు వచ్చారు. అసలు మీరు మీడియా గురించి ఏమనుకుంటున్నారు. ఇంత లేట్ రావడానికి.., మా అందరి సమయం వృధా చేయడానికి కారణమేంటని ఒక జర్నలిస్ట్ అల్లు అర్జున్ ను ప్రశ్నించాడు. దాంతో అల్లు అర్జున్ మాట్లాడుతూ "తనకు ఈ ప్రెస్ మీట్ ఏ సమయానికి ఉందనే విషయం చెప్పలేదని.., నేను ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఇక్కడికి చేరుకున్నానని.., కొంచెం మంచు ప్రభావం ఉండటం వల్లే ఫ్లైట్ ఆలస్యమయిందని తెలిపాడు. ఇంతసేపు వెయిట్ చేయించినందుకు మీ అందరూ నన్ను క్షమించండి అంటూ జర్నలిస్టులకు సభాముఖంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story