Allu Arjun: భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్ .. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌

Allu Arjun: వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న స్టైలిష్ సార్ అల్లు అర్జున్ తాజాగా "పుష్ప: ది రైజ్" సినిమాతో భారీ హిట్ ను అందుకున్నారు.

Arun Chilukuri
Updated on: 20 April 2022 9:00 PM IST
Allu Arjun Says no to Endorsing Tobacco Product
X

Allu Arjun: భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్ .. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌

Allu Arjun: వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న స్టైలిష్ సార్ అల్లు అర్జున్ తాజాగా "పుష్ప: ది రైజ్" సినిమాతో భారీ హిట్ ను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా మారి అల్లు అర్జున్ స్టార్డమ్ ను మరొకసారి నిరూపించింది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండే అల్లు అర్జున్ మరోవైపు పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఎండార్స్ మెంట్ లు చేస్తూ ఉంటారు. ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేసిన అల్లు అర్జున్ తాజాగా ఒక పెద్ద ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక ప్రముఖ పొగాకు సంబంధిత సంస్థ నుంచి బ్రాండ్ ఎండార్స్ మెంట్ చేసే భారీ ఆఫర్ బన్నీ కి లభించిందట. అయితే తమ ప్రకటనలో నటించేందుకు సదరు పొగాకు కంపెనీ అల్లు అర్జున్‌కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను ఆఫర్‌ చేసిందట. కానీ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు వంటి ప్రోడక్ట్స్‌కు తను బ్రాండ్ ఎండార్స్మెంట్ లు చేయనని ఖరాఖండిగా చెప్పిన అల్లు అర్జున్ ఆ పెద్ద డీల్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఇది తన ఫ్యాన్స్‌ను తప్పుదారి పట్టిస్తుందని, అందుకే ఈ ప్రకటనలో నటించనంటూ బన్నీ ఈ ఆఫర్‌కు నో చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఫ్యాన్స్‌, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కోట్ల రూపాయలు ఇచ్చే ఆఫర్‌ను తీరస్కరించడంపై అతడి ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప" సినిమా రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మరొక రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story