Pushpa Movie: అల్లు అర్జున్ - సమంత పాటకి అదిరిపోయే టైటిల్

*బన్నీతో ఈ పాటకి స్టేప్పులేయనున్న సామ్

admin1
Updated on: 2 Dec 2021 6:31 PM IST
Allu Arjun Samantha Item Song Title in Pushpa Movie
X

అల్లు అర్జున్ - సమంత పాటకి అదిరిపోయే టైటిల్ (ఫైల్ ఫోటో)

Pushpa Movie: టాలీవుడ్ బ్యూటీ సమంత ఇప్పుడు తన కెరీర్ పైన బాగానే దృష్టి పెట్టింది. వరుస సినిమాలకు సైన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సమంత ఏకంగా ఐటెం నెంబర్ గా కూడా మారి షాక్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "పుష్ప" సినిమాలో సమంత ఒక ఐటెం సాంగ్ లో బన్నీతో కలిసి డాన్స్ చేయనున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా లోని 5వ పాట గా విడుదల కానున్న ఈ పాటకి అదిరిపోయే టైటిల్ ను పెట్టారు.

"ఉ అంటావా ఊ అంటావా" అంటూ ఈ మాస్ స్పెషల్ ఐటెం పాట అందరినీ ఆకట్టుకోడానికి సిద్ధమవుతోంది. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనసూయ, సునీల్ మరియు ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమాని విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story