Pushpa Movie Update: "పుష్ప" షూటింగ్ చివరి షెడ్యూల్ లో అల్లు అర్జున్

పుష్ప పోస్టర్ (ఫోటో: ట్విట్టర్)
Pushpa Movie Update: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంత విరామం తర్వాత తిరిగి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న "పుష్ప"
Pushpa Movie Update: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంత విరామం తర్వాత తిరిగి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న "పుష్ప" చిత్ర షూటింగ్ చివరి షెడ్యూల్ లో మంగళవారం ఉదయం పాల్గొన్నారు. ఇప్పటికే అభిమానులు ఎపుడేప్పుడా అని ఎదురుచూస్తున్న "పుష్ప" సినిమాని అతి త్వరలో పూర్తి చేసి 13 ఆగష్టు 2021 రోజున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే దాదాపుగా ౩౦ రోజుల ఈ షూటింగ్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుమారుగా 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకుర్చున్నాడు. మరోపక్క ఇప్పటివరకు కమెడియన్, హీరో గా వెండి తెర పై కనిపించిన సునీల్ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నిడివి పెరగడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి భాగాన్ని 13 ఆగష్టు 2021 లో రెండవ భాగాన్ని 2022 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారీ అంచనాలతో తెలుగులో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. దక్షిణాది సినిమాలో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ తో పాటు విభిన్నమైన కథతో రాబోతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించబోతుందని, అల్లు అర్జున్ కెరీర్ లో ఇది గొప్ప సినిమాగా నిలుస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Icon staar @alluarjun's #Pushpa Shoot resumes today 🔥#PushpaRaj #ThaggedheLe 🤙
— BARaju's Team (@baraju_SuperHit) July 6, 2021
PUSHPA SHOOT RESUMES 💥@iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/pmOMJMUadx
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMT