బిగ్ బాస్ 3 పై రియాక్ట్ అయిన బన్నీ

బిగ్ బాస్ 3 పై రియాక్ట్ అయిన బన్నీ
x
Highlights

పాపులర్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు హోస్ట్ గా ఎన్టీఆర్, రెండో సీజన్ కి హోస్ట్ గా నాని...

పాపులర్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు హోస్ట్ గా ఎన్టీఆర్, రెండో సీజన్ కి హోస్ట్ గా నాని ప్రేక్షకులను బాగానే మెప్పించారు. ఇక మూడవ సీజన్ కి హోస్ట్ గా ఎవరు వ్యవహరించనున్నారు అనే విషయంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో వెంకటేష్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పేర్లు బయటకు వచ్చాయి. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 పైన అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. నిజానికి బిగ్ బాస్ మొదటి రెండు రెండు సీజన్లలో కూడా అల్లు అర్జున్ గెస్ట్ గా వ్యవహరించాల్సిందట.

బిగ్ బాస్ మొదలుపెడదాం అనుకున్నప్పుడు ముందుగా హోస్ట్ గా అల్లు అర్జున్ ని సంప్రదించారని కానీ తను అప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన కుదరలేదని బన్నీ వెల్లడించాడు. అయితే ఇప్పుడు మూడవ సీజన్ చేసే తీరిక కూడా తనకు లేదని ప్రస్తుతం సినిమాల పైనే తాను దృష్టి పెడుతున్నానని క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇక సినిమాల పరంగా బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories