Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే "పుష్ప: ది రైజ్" సినిమాతోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు.

Arun Chilukuri
Published on: 11 Aug 2022 3:03 PM IST
Allu Arjun Rejects 10 Crore Amount to promote Liquor Brand
X

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే "పుష్ప: ది రైజ్" సినిమాతోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక సినిమాలు మాత్రమే కాకుండా అల్లు అర్జున్ టీవీ కమర్షియల్స్ మరియు బ్రాండ్ ఎండార్స్మెంటులతో కూడా బాగానే సంపాదిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే.

కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బన్నీ ఒక ప్రముఖ బ్రాండ్ యాడ్ లో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. టొబాకో, గుట్కా, యాడ్లో నటించడానికి గతంలో బన్నీ ససేమెరా ఒప్పుకోలేదు. సమంత, ప్రియాంక చోప్రా, ఆలియా భట్ వంటి వారు కూడా ప్రముఖ లిక్కర్ బ్రాండ్ల కోసం క్యాంపెయిన్ లలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ బీర్ బ్రాండ్ అల్లు అర్జున్ ను ఒక ఆడ్ కోసం సంప్రదించారట.

దానికిగాను 10 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ తాజా సమాచారం ప్రకారం బన్నీ ఆఫర్ ని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. తను ఇలాంటి యాడ్స్ లో నటిస్తే అది తన అభిమానులను చెడు దోవలోకి తీసుకువెళుతుందని అందుకే బన్నీ ఈ యాడ్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులు #ఏఏనంబర్1 అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story