Unstoppable Show: బన్నీ కోసం రవితేజ ని పక్కన పెట్టిన బాలకృష్ణ

Allu Arjun Rashmika and Sukumar Going to Balakrishna Unstoppable Show for Pushpa Movie Promotions
x

బాలకృష్ణ షోలో పుష్ప బృందం (ఫైల్ ఫోటో) 

Highlights

Unstoppable Show: బాలకృష్ణ షోలో పుష్ప బృందం

Unstoppable Show - Pushpa Movie Team: భారీ అంచనాల మధ్య "పుష్ప" సినిమా లోని మొదటి పార్ట్ "పుష్ప: ది రైజ్" ఈ మధ్యనే డిసెంబర్ 17న విడుదలైంది. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజున మిక్స్డ్ టాక్ అందుకుంటున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఆ సినిమా విడుదలయ్యాక కూడా దర్శక నిర్మాతలు ప్రమోషన్ల విషయంలో అదే జోరు కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్ కోసం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో కి వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్, రష్మిక తో పాటు దర్శకుడు సుకుమార్ కూడా ఈ ఎపిసోడ్లో పాల్గొనబోతున్నారు. నిజానికి తదుపరి ఎపిసోడ్ లో రవితేజ మరియు గోపీచంద్ మలినేని ఇంటర్వ్యూ కి రావాల్సి ఉంది. కానీ పుష్ప ప్రమోషన్ల కోసం ఆ ఎపిసోడ్ ని వాయిదా వేయాల్సి వచ్చింది. బాలకృష్ణ "అఖండ" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బన్నీ కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యనే విడుదలైన "అఖండ" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories