Pushpa: తగ్గేదేలే.. యూట్యూబ్‌లో 'పుష్ప' టీజర్ షాకింగ్ రికార్డ్స్‌!

Pushpa: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా విడుదలకు ముందే రికార్డులతో దూసుకపోతోంది.

Venkata Chari
Published on: 4 Jun 2021 10:20 PM IST
Allu Arjun Pushpa Teaser Crosses 70 Million Views
X

పుష్ప టీజర్ (ఫొటో ట్విట్టర్)

Pushpa: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా విడుదలకు ముందే రికార్డులతో దూసుకపోతోంది. క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ కోసం సిద్ధమైన ఈ జోడీ.. పుష్పను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, మోషన్ పోస్టర్, అల్లు అర్జున్ లుక్ ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలిసిందే.

పుష్ప రాజ్‌వదిలిన టీజర్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ కొనసాగిస్తూనే ఉంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వదిలిన ఈ టీజర్ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టిన టీజర్లు టాలీవుడ్‌లో చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఈ జాబితాలో ఫస్ట్ టైం పుష్ప టీజర్ చేరింది. తాజాగా మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ టీజర్.

70 మిలియన్ల వ్యూస్‌ను మొదటిసారిగా, వేగంగా కొల్లగొట్టేసిన పుష్ప అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అలాగే 1.6మిలియన్ల లైకులను సొంతం చేసుకుంది ఈ టీజర్. తగ్గేదేలే అంటూ పుష్ప టీం వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story