Allu Arjun Pushpa: మళ్లీ రంగంలోకి 'పుష్ప'బృందం

Allu Arjun Pushpa: లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది అల్లు అర్జున్ పుష్ఫ చిత్రబృందం

Kranthi
Published on: 15 Jun 2021 11:43 AM IST
Allu Arjun Pushpa Shoot Resumes From This Month
X

అల్లు అర్జున్ పుష్ప పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Allu Arjun Pushpa: లాక్ డౌన్ సడలింపులు రావడంతో ఇక తగ్గేదే లే అంటున్నాడు పుష్ప. ఇక రఫ్ అండ్ టఫ్ కేరెక్టర్ చేస్తున్న అల్లు అర్జున్ కెమెరా ముందుకొచ్చేస్తున్నాడు. పుష్ప సినిమా షూటింగ్ శరవేగంతో జరగనున్నది.

తగ్గేదే లే... అనే సంభాషణ తరహాలోనే చిత్రీకరణలోనూ జోరు చూపిస్తోంది 'పుష్ప' బృందం. కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలోనూ ఈ సినిమా చిత్రీకరణ సాగింది. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడం లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ నెలాఖరు నుంచే హైదరాబాద్‌లో చిత్రీకరణ షురూ చేయనున్నారు.

కథానాయకుడు అల్లు అర్జున్‌, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగం దాదాపు తుదిదశకు చేరుకుంది. 'ఆర్య', 'ఆర్య2' తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది.

Kranthi

Kranthi

Next Story