Pushpa Movie: రెండు భాగాలుగా అల్లు అర్జున్ 'పుష్ప'..కారణం ఏంటో తెలుసా?

Allu Arjun Pushpa Movie: యంగ్ హీరో అల్లు అర్జున్, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వస్తోన్న సినిమా ‘పుష్ప’.

Venkata Chari
Published on: 12 May 2021 4:54 PM IST
Allu Arjun Pushpa Movie Will Be Released in Two Parts
X

అల్లు అర్జున్ (ఫొటో ట్విట్టర్)

Allu Arjun Pushpa Movie: యంగ్ హీరో అల్లు అర్జున్, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వస్తోన్న సినిమా 'పుష్ప'. పాన్‌ ఇండియాగా రానున్న ఈ సినిమా..ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు బన్నీ కూడా కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా 'పుష్ప'గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. డైరెక్టర్ సుకుమార్‌ ఈ మూవీని రెండు పార్టులుగా తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరు దీనిపై రిప్లై ఇచ్చారని, పుష్ప సినిమా రెండు పార్టులుగా తీస్తుంది నిజమే అని పేర్కొన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు. దీనికో కారణం కూడా ఉందంట. పుష్ప కథను కేవలం రెండున్నర గంటల్లో చెప్పడం అంటే చాలా కష్టమట. ఈ కథకు ఎంతో స్పాన్ ఉందంట. మరి అలాంటి పుష్పను ఒకే సినిమా గా చూపించడం కష్టమని, అందుకే హీరో అల్లు అర్జున్‌, సుకుమార్‌ తో చర్చించి రెండు పార్టులుగా తీయాలని ప్లాన్ చేస్తున్నారంట.

ఇక పుష్ప మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ మూవీ. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. తాజాగా విడుదల చేసిన పుష్పరాజ్‌ వీడియో యూట్యుబ్ లో హల్ చల్ క్రియోట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో విలన్‌గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. రష్మిక మందాన్న హీరోయిన్‌ గా అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయనుంది. వీరి కాంబినేషన్‌లో ఇది మొదటి సినిమా. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా పుష్ప ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

Venkata Chari

Venkata Chari

Next Story