Pushpa Movie: మారేడుమిల్లి అడవుల్లో పుష్ప చిత్రబృందం

* ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్, సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 3వ సినిమా పుష్ప

admin1
Updated on: 9 Oct 2021 12:02 PM IST
Pushpa Movie: మారేడుమిల్లి అడవుల్లో పుష్ప చిత్రబృందం
X

మారేడుమిల్లి అడవుల్లో పుష్ప చిత్రబృందం (ట్విట్టర్ ఫోటో)

Pushpa Shooting: ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా పుష్ప. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్యన ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ లోని ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల లో జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవులలో చిత్ర బృందం ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది.

అల్లు అర్జున్ మరియు వందల మంది ఫైటర్ల తో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నెల ఆఖరి వరకు షూటింగ్ ఇక్కడే జరగబోతోంది. అక్టోబర్లో ఈ సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనులను మొదలు పెట్టనున్నారు దర్శకనిర్మాతలు. మలయాళం స్టార్ హీరో అయిన ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అనసూయ భరద్వాజ్ మరియు జగపతి బాబు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story