అల్లు అర్జున్ పుష్ప టీమ్‌కు భారీ షాక్.. సీన్స్ లీక్

*అల్లు అర్జున్ పుష్ప టీమ్‌కు భారీ షాక్ *పుష్ప సినిమా నుంచి రెండు సన్నివేశాలు లీక్

Samba Siva Rao
Published on: 3 Feb 2021 8:52 PM IST
అల్లు అర్జున్ పుష్ప టీమ్‌కు భారీ షాక్.. సీన్స్ లీక్
X

 పుష్ప  సీన్స్  లీక్ 

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టీమ్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా నుంచి తాజాగా రెండు సన్నివేశాలు లీకయ్యాయి. అందులో ఒకటి బన్నీ, రష్మికల మధ్య వచ్చే మెలోడీ సాంగ్ కాగా‌, మరొకటి పోలీసులకు, అల్లు అర్జున్‌లకు మధ్య జరిగే ఫైట్‌ సీన్‌. ఈ రెండు సీన్లకు సంబంధించిన క్లిప్పింగులుచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెట్స్ పైకొచ్చిన మొదటి రోజు నుంచి ఈ సినిమా లీకుల బారిన పడుతూనే ఉంది. తాజాగా ఇలా ఒకేసారి రెండు సీన్లు లీక్ అవ్వడం యూనిట్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాను.. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story