Allu Arjun Pushpa Movie: 'పుష్ఫ' రిలీజ్ డేట్ ఫిక్స్

Samba Siva Rao
Published on: 28 Jan 2021 3:21 PM IST
Allu Arjun Pushpa Movie:  పుష్ఫ రిలీజ్ డేట్ ఫిక్స్
X

పుష్ప

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తోన్నహాట్రిక్ చిత్రం 'పుష్ప'. గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌‌తో పాటు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పుష్ప' సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కేరళ అడవుల్లో కాకుండా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

గత ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కెన 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ ని సాధించాడు బన్నీ.. ఆ సినిమా తర్వాత బన్ని కొంత గ్యాప్ ఇచ్చి..సుకుమార్ దర్శకత్వలో 'పుష్ప'సినిమా చేస్తున్న సంగతి తెలసిందే కదా.

'పుష్ప' ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. ఈ ఏడాది ఆగష్టు 13న పుష్పను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. 'పుష్ప' మూవీలో ఐటెం సాంగ్‌పై ప్లాన్ చేస్తున్నారట. అయితే బన్నీతో ఆడిపాడేందుకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాను ఫైనల్ చేశారని తెలుస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story