Pushpa Movie Part 1: క్రిస్మస్ బరిలో దిగనున్న "పుష్ప" పార్ట్ 1

Allu Arjun Pushpa Movie Part 1 to Release on Christmas 2021
x

Pushpa Movie Part 1: క్రిస్మస్ బరిలో దిగనున్న "పుష్ప" పార్ట్ 1

Highlights

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" ఒకటి.

Pushpa Movie Part 1: ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" ఒకటి. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా "పుష్ప" మొదటి పార్ట్ విడుదల గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను విడుదల చేసింది ఈ చిత్ర బృందం. ట్విట్టర్ వేదికగా దర్శక నిర్మాతలు సినిమా ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. "ఆర్య" మరియు "ఆర్య2" వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్లో ఈ సినిమా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో ఫాహధ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక హిందీ, తమిళ్, మలయాళం, మరియు కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories