Pushpa Movie: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న పుష్ప

* రికార్డుల మోత మోగిస్తున్న పుష్ప

admin1
Updated on: 19 Dec 2021 1:00 PM IST
Allu Arjun Pushpa Movie Create Records with Box Office Collections
X

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న పుష్ప

Pushpa Movie: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు సినిమా అంతంతమాత్రంగానే ఉంది అన్న రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది అని చెప్పుకోవాలి. కేవలం మొదటి రోజే మొత్తం నైజాం ఏరియాలో కలిపి సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు 11.44 కోట్లు సాధించింది. ఇది ఒక రికార్డు. ఎడిషనల్ షోలు మరియు పెరిగిన టికెట్ ధరలు ఈ సినిమా కలెక్షన్ల కి బాగా హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు.

తెలుగులో మాత్రమే కాక పుష్ప సినిమా వివిధ మిగతా భాషల్లో కూడా కలెక్షన్ల పరంగా అంతే జోరు చూపిస్తోంది. మార్నింగ్ షో లకి అంతగా ఆక్యుపెన్సీ లేకపోయినప్పటికీ పాజిటివ్ టాక్ వల్ల పుష్ప కలెక్షన్లు బాగానే అందుకుంటోంది. హిందీ లో మొదటి రోజు పుష్ప మూడు కోట్లు గడిచింది. థియేటర్లలో ఎన్ని నిబంధనలను విధించినప్పటికీ, మొదటిరోజే మూడు కోట్లు సంపాదించడం నిజంగా ఒక రికార్డు. సైరా మరియు కేజీఎఫ్ సినిమా సైతం దాటుకొని హిందీలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు నమోదు చేసుకున్న సౌత్ ఇండియన్ సినిమాలలో ఒకటిగా మారింది పుష్ప. కర్ణాటకలో కూడా అంతే జోరుగా కలెక్షన్లు నమోదు చేసుకుంటున్న "పుష్ప" సినిమా మొదటిరోజు 3.65 కోట్లను గడిచింది. ఈ కలెక్షన్ల జోరు చూస్తుంటే "పుష్ప" సినిమా అతి త్వరలోనే నలభై నుంచి యాభై కోట్ల వరకు సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి.

admin1

admin1

Next Story