Pushpa 2 Teaser: పుష్ప 2’ టీజర్‌ వచ్చేసింది.. ఈసారి గంగమ్మ జాతరే..!

Pushpa 2 Teaser Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే.

Arun Chilukuri
Published on: 8 April 2024 11:46 AM IST
Allu Arjun Pushpa 2 The Rule Teaser Out
X

Pushpa 2 Teaser: పుష్ప 2’ టీజర్‌ వచ్చేసింది.. ఈసారి గంగమ్మ జాతరే..!

Pushpa 2 Teaser Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే..తెలుగులో కంటే హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పుష్ప మూవీ దుమ్ము దులిపేసింది. పుష్ప సినిమా సంచలన విజయం నమోదు చేయడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పుష్ప 2 పనుల మీద బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్రబృందం స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘పుష్ప ది రూల్‌’ టీజర్‌ విడుదల చేసింది. సినిమాలో కీలకంగా సాగే జాతర సన్నివేశాలతో ఇది సిద్ధమైంది. మాస్‌ అవతార్‌లో బన్నీ లుక్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు ఈలలు వేయించేలా ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తున్న పుష్ప సీక్వెల్ ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నామ‌రోసారి ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. శ్రీవల్లిగా డీగ్లామరైజ్‌డ్‌ రోల్‌లో క‌నిపించ‌నుంది . పార్టు 2లో ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story