Pushpa 2: పుష్ప పార్ట్ 2 కి విడుదల ఖరారు?

Allu Arjun Pushpa 2 Release Date Update | Tollywood News
x

Pushpa 2: పుష్ప పార్ట్ 2 కి విడుదల ఖరారు?

Highlights

Pushpa 2: పుష్ప పార్ట్ 2 కి విడుదల ఖరారు?

Pushpa 2: "పుష్ప: ది రైజ్" సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక ఈ సినిమా రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" పైన అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా సినిమా విడుదల కి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి పుష్ప మొదటి భాగం గతేడాది డిసెంబర్లో విడుదలైంది. ఇక ఈ సినిమా రెండవ భాగం డిసెంబర్లో విడుదలవుతుందని అందరూ అనుకున్నారు కానీ సినిమా షూటింగ్ ఈమధ్యనే మొదలైంది. దీంతో సినిమా విడుదల అవ్వడానికి వచ్చే ఏడాది వేసవి అవుతుందని కొందరు చెబుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ సెంటిమెంట్ మిస్ అవ్వకుండా ఈ సినిమాని కూడా ఈ ఏడాది డిసెంబర్ లోపల పూర్తి చేసి విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories