'మహర్షి' కి మద్దతు పలికిన ప్రభాస్, బన్నీ

మహర్షి కి మద్దతు పలికిన ప్రభాస్, బన్నీ
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా మహర్షి సినిమా త్వరలో మే 9న విడుదల కాబోతోంది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా హెగ్డే...

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా మహర్షి సినిమా త్వరలో మే 9న విడుదల కాబోతోంది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు తాజాగా ఈ సినిమా వెనుక బన్నీ మరియు ప్రభాస్ మద్దతు కూడా ఉందని ప్రచారం సాగుతోంది అది నూటికి నూరుపాళ్లు నిజం అని తెలుస్తోంది ఇద్దరు డైరెక్టుగా పెట్టి సినిమాపై పెట్టుబడులు పెట్టక పోయినప్పటికీ వారి హోమ్ బ్యానర్లు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి

దిల్ రాజు, పీవీపీ, అశ్వనిదత్ కలిసి నిర్మించిన ఈ సినిమా కృష్ణాజిల్లా పంపిణీ బాధ్యత దిల్ రాజు తీసుకోగా, యువి క్రియేషన్స్, గీతా సిండికేట్ కూడా దిల్ రాజు తో చేతులు కలిపాయి. అంటే ఈ మూడు అగ్ర బ్యానర్ల అధినాయకులు కలిసి 'మహర్షి'ని పంపిణీ చేస్తున్నారనామాట. సమాన వాటాలు వేసుకుని బిజినెస్ చేస్తున్నారు కాబట్టి లాభాల్లో కూడా సమానంగానే వాటాలు పంచుకుంటారట. కృష్ణా జిల్లా హక్కులు రూ.6 కోట్ల బిజినెస్ సాగగా, ముగ్గురూ తలో రెండు కోట్లు చొప్పున షేర్ చేసుకుంటారట. ఆ విధంగా మహేష్ కి బన్నీ, ప్రభాస్ లు తమ సంస్థలు ద్వారా మద్దతు పలికాయి అన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories