Pushpa Movie Update: పుష్ప లో బన్నికి ఈ లోపం ఉండబోతుందా..!?

admin1
Updated on: 25 Aug 2021 8:30 PM IST
Allu Arjun Playing a Defect in his Character in Pushpa Movie | Pushpa Movie Update
X

అల్లు అర్జున్ (ఫైల్ ఫోటో)

Pushpa Movie Update: "ఆర్య" మరియు "ఆర్య 2" సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "పుష్ప". రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు తన అన్నీ సినిమాలలో హీరోకి ఏదో లోపం ఉండటం చాలా సార్లు గమనించాను. ఉదాహరణకు రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ ఒక చెవిటి వాడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కూడా ఒక లోపం ఉండబోతుందట.

ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు కుడి భుజం సరిగ్గా పనిచేయదట. అందుకే ఎలాంటి అనుమానాలు కలిగించకుండా "దాక్కో దాక్కో మేక" పాట మొత్తం ఎడమ చేతితోనే స్టెప్స్ వేసేలా చూస్తున్నారట. మరి ఈ లోపం సినిమాలో ఎలా ఉండబోతోందో చూడాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు జగపతి బాబు, ప్రకాష్ రాజ్ మరియు సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక మలయాళం, తమిళ్, హిందీ మరియు కన్నడ భాషలలో కూడా డబ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story