Allu Arjun: అంధుడి పాత్రలో బన్నీ ?

Kranthi
Published on: 22 Jun 2021 9:07 AM IST
Allu Arjun Play Blindfolded in Director Venu Sriram Icon Movie
X

Allu Arjun,Director Venu Sriram Icon Movie:(The Hans India)

Allu Arjun: డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ తన తరువాత ఐకాన్ మూవీ చేయనున్నాడు. దీనికి కనుబడుట లేదు అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ మూవీ లేట్ అవుతూ వస్తుంది…. తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా తర్వాత ఐకాన్ సెట్స్ పైకి వెళ్లనున్నందట. ఇప్పటికే డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఢిపరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ సినిమాలో కనుబడుట లేదు అనే ట్యాగ్ లైన్ ఉన్నట్లు ఇందులో బన్నీకి నిజంగానే కళ్లు కనిపించవని టాక్. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం పుష్పలో పూర్తిగా డీ గ్లామర్స్ లుక్ లో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న లెటేస్ట్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీనెక్స్టు మూవీ ఇదేనని టాలీవుడ్ టాక్

Kranthi

Kranthi

Next Story