Allu Arjun: పుష్ప టీమ్ మీటింగ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

admin1
Published on: 19 Feb 2022 10:04 AM IST
Allu Arjun Plans Pushpa Team Meeting
X

Allu Arjun: పుష్ప టీమ్ మీటింగ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్ 

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో పుష్ప సెకండ్ పార్ట్ అయిన "పుష్ప: ది రూల్" పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చిత్ర బృందంతో మాట్లాడడానికి ఒక మీటింగు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చిత్ర దర్శకుడు సుకుమార్ నిర్మాతలు మరియు ముఖ్య నటీనటులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.

ఈ మీటింగ్లో మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ కి విడుదల చేయాలని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ మార్చి మధ్యలో నుంచి షూటింగ్ మొదలు పెట్టి నాలుగు నెలల్లో షూటింగ్ని పూర్తి చేయమని సుకుమార్కి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వివిధ భాషల్లో విడుదలైన పుష్ప సినిమా హిందీలో కూడా భారీగా హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే పుష్ప సెకండ్ పార్ట్ తో హిందీ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని రిలీజ్ ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. అలాగే హిందీ లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది "పుష్ప" బృందం.

admin1

admin1

Next Story