Allu Arjun: నెటిజన్ల నోరు మూయించిన స్టైలిష్ స్టార్..

Allu Arjun: ఇండస్ట్రీ మొత్తం రెబల్ స్టార్ కృష్ణంరాజు హఠాత్ మరణంతో దుఖః సాగరంలో మునిగిపోయి ఉన్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 12 Sept 2022 8:16 PM IST
Allu Arjun Pays Last Respects to Veteran Star Krishnam Raju
X

Allu Arjun: నెటిజన్ల నోరు మూయించిన స్టైలిష్ స్టార్..

Allu Arjun: ఇండస్ట్రీ మొత్తం రెబల్ స్టార్ కృష్ణంరాజు హఠాత్ మరణంతో దుఖః సాగరంలో మునిగిపోయి ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం "పుష్ప: ది రైజ్" సినిమాకి గాను సైమా 2022లో బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బన్నీ తో పాటు అభిమానులు కూడా ఈ విషయమై సంతోషంగానే ఉన్నప్పటికీ దీని గురించిన సెలబ్రేషన్స్ చేసుకునే సమయం ఇది కాదు అంటూ కొందరు అల్లు అర్జున్ పై మండిపడ్డారు.

కృష్ణంరాజు గురించి పోస్ట్ చేయకుండా ఇలా తన సినిమా సెలబ్రేషన్స్ పోస్ట్ మాత్రమే చేయడంతో రెబల్ స్టార్ అభిమానులు స్టైలిష్ స్టార్ పై నిప్పుల వర్షం కురిపించారు. తాజాగా అలాంటి వారు నోరు మూత పడెలాగా అల్లు అర్జున్ కృష్ణం రాజు ఇంటికి వెళ్ళారు. సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్ గా కృష్ణం రాజు ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ తన సంతాపాన్ని తెలియజేశారు.

అల్లు అర్జున్ మరియు ప్రభాస్ కూడా చాలా మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో బన్నీ స్వయంగా వెళ్లి ప్రభాస్ కి ధైర్యం చెప్పి వచ్చారు. ప్రభాస్ మరియు బన్నీ ల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలా అల్లు అర్జున్ ఒక్క దెబ్బతో నెటిజన్ల నోటికి తాళం వేసేశారు. కష్ట సమయంలో ప్రభాస్ వద్దకు వెళ్ళి మరి తోడు నిలవడంతో బన్నీ పై ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు కొందరు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story