ఎన్టీఆర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్..? బాలీవుడ్ డైరెక్టర్ అదిరిపోయే స్కెచ్..!

Allu Arjun NTR Multistarrer Under the Direction of Aditya Dhar
x

ఎన్టీఆర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్..? బాలీవుడ్ డైరెక్టర్ అదిరిపోయే స్కెచ్..!

Highlights

ఎన్టీఆర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్..? బాలీవుడ్ డైరెక్టర్ అదిరిపోయే స్కెచ్..!

Allu Arjun NTR Multistarrer: దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ తెగ పండుగ చేసుకున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పంటూ కొట్టుకునే ఫ్యాన్స్ ను రాజమౌళి తన ఆర్ ఆర్ ఆర్ మూవీతో దగ్గర చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ఎన్టీఆర్, చరణ్ ‌ల మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు షాక్ అయ్యారు కూడా. ఫ్యాన్స్ సైతం ఒకరినొకరు గౌరవించుకోవడం మొదలు పెట్టారు. మొత్తంగా బద్దశత్రువుల్లా వ్యవహరించిన మెగా, నందమూరి అభిమానుల తీరును ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎంతగానో మార్చింది. ఇక, అసలు విషయం ఏంటంటే...ఆర్ ఆర్ ఆర్ ను మరిపించేస్తూ మరోసారి మెగా, నందమూరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మల్టి స్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. ఈ ట్రెండ్ ని మరో అడుగు ముందుకు తీసుకెళ్తూ మెగా ఫ్యామిలీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా చేసేందుకు నందమూరి టైగర్ ఎన్టీఆర్ ముందుకొచ్చాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య థార్...ఎన్టీఆర్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పౌరాణిక నేపధ్యం ఉన్న సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్, అల్లు అర్జున్ ను కలిసి స్టోరీ లైన్ వినిపించగా, ఇద్దరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. స్టోరీ లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రావాలని దర్శకుడికి అల్లు అర్జున్, ఎన్టీఆర్ చెప్పారట. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ క్రేజీ కాంబినేషన్ లో త్వరలోనే మనం చూడొచ్చు.

ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తైన తర్వాత హిందీలో వార్త్ 2 సినిమా చేస్తాడు, అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కూడా సినిమా ఉంది. ఇక, అల్లు అర్జున్ విషయానికొస్తే దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప2 చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ వంగతో సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తైన తర్వాత ఎన్టీఆర్ – అల్లు అర్జున్ మూవీని పట్టాలెక్కిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories