Allu Arjun: పుష్ప 1 తర్వాత ఈ దర్శకుడితో చేతులు కలపబోతున్న స్టైలిష్ స్టార్

Allu Arjun: పుష్ప పార్ట్ వన్ మరియు పుష్ప పార్ట్2 సినిమాలకి మధ్యలో బన్నీ ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.

admin1
Updated on: 8 Oct 2021 5:31 PM IST
Allu Arjun Next Movie After Pushpa 1 is with Boyapati Srinu | Tollywood News
X

పుష్ప 1 తర్వాత ఈ దర్శకుడితో చేతులు కలపబోతున్న స్టైలిష్ స్టార్

Allu Arjun New Movie: "అల వైకుంఠ పురం లో" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పల్లెటూరి అడవి బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ కథ ఎర్రచందనం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ రగ్డ్ లుక్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మలయాళం స్టార్ ఫాహాధ్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. "వకీల్ సాబ్" ఫేమ్ వేణు శ్రీరామ్ తో బన్నీ "ఐకాన్" సినిమా చేయాల్సి ఉంది కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అల్లు అర్జున్ మళ్లీ వాయిదా వేశారని తెలుస్తోంది. పుష్ప పార్ట్ వన్ మరియు పుష్ప పార్ట్2 సినిమాలకి మధ్యలో బన్నీ ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం "పుష్ప 1" సినిమా తర్వాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. "సరైనోడు" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బన్నీ బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

admin1

admin1

Next Story