Allu Arjun New Movie: గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది! అల్లు అర్జున్ కొత్త సినిమా షూటింగ్ పరిస్థితి!!

Allu Arjun New Movie: ఏంట్రో గ్యాప్ ఇచ్చావ్ అంటే...ఇవ్వలా వచ్చింది. అలా వైకుంఠపురం మూవీలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలియనిది కాదు.

Arun Chilukuri
Published on: 10 July 2020 2:45 PM IST
Allu Arjun New Movie: గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది! అల్లు అర్జున్ కొత్త సినిమా షూటింగ్ పరిస్థితి!!
X
Allu Arjun Pushpa Movie (File Photo)

Allu Arjun New Movie: ఏంట్రో గ్యాప్ ఇచ్చావ్ అంటే...ఇవ్వలా వచ్చింది. అలా వైకుంఠపురం మూవీలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలియనిది కాదు. ఇప్పుడు ఆ డైలాగుకు సరిపోనూ..సేమ్ టూ సేమ్ అలానే ఉంది టాలీవుడ్ సినిమా షూటింగ్ ల పరిస్థితి.

నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా సినిమాపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ అది ఆశించిన విధంగా సక్సెస్ అవ్వలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్నా అర్జున్ మళ్లీ త్రివిక్రమ్ తో హిట్ కొట్టాకా... వరుసగా సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

అలా వైకుంఠపురం తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక షూటింగ్ కు సన్నద్ధమయ్యే లోపే కరోనా విజృంభణ మొదలైంది. దీంతో ఎక్కడికక్కడ షూటింగ్ లను నిలిపేశారు. ఇటీవల ప్రభుత్వం సడలింపులు ఇచ్చినప్పటికీ షూటింగ్ ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది.

ఏదేమైనా ఈ ఏడాది వరుస సినిమాలు చేయాలనుకున్నా అర్జున్ కు కరోనా బ్రేకులు వేసింది. ఇక చేసేదేమి లేక తన పిల్లలతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తోన్న స్టైలిష్ స్టార్ పరిస్థితి...గ్యాప్ ఇవ్వలా...వచ్చింది అనే డైలాగుకు సరిపోయినట్లైంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story