Allu Arjun: 'ఐకాన్' మూవీ షూటింగ్ ఎప్పుడంటే

Aa ICON
x

అల్లు అర్జున్ ఫైల్ ఫోటో 

Highlights

Allu Arjun: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఐకాన్‌'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై...

Allu Arjun: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఐకాన్‌'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించనున్నారు. గతంలోనే ఈ సినిమా పట్టాలెక్కాల్సింది. అయితే 'వకీల్‌సాబ్‌' తెరకెక్కిస్తుండటంతో 'ఐకాన్‌' వాయిదా పడింది. వకీల్ సాబ్ పూర్తికావడంతో అల్లుఅర్జున్ చిత్రంపై దిల్ రాజు స్పందించారు.

ఇటీవల 'పుష్ప' టీజర్‌ చివరిలో అల్లు అర్జున్‌ పేరు ముందు 'స్టైలిష్‌ స్టార్‌'కు బదులుగా 'ఐకాన్‌ స్టార్‌' అని ఉంది. దీంతో పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. వీటన్నిటికి దిల్ రాజు బదులిచ్చారు. వకీల్ సాబ్ సక్సెస్ మీట్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 'ఐకాన్‌ స్టార్‌'పై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'ఐకాన్‌ స్టార్‌' అనేది అల్లుఅర్జున్ పేరేమో, ఆయన పెట్టుకున్నారేమో, తమకు తెలియదని బదులిచ్చారు. తమ బ్యానర్‌లోనే 'ఐకాన్‌' మూవీ ఉంటుందని అన్నారు. నటినటీలు వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఐకాన్ ఆ కథ బాగా నచ్చిందన్నారు. వేణు కథ చెప్పిన దగ్గరి నుంచి దానితోనే ప్రయాణం చేశాం. స్క్రిప్ట్‌ రెడీగా ఉంది. ఇతర కారణాల వల్ల కాస్త ముందూ వెనుక అవుతుందంతే.. త్వరలోనే ప్రారంభిస్తామని దిల్ రాజు అన్నారు.

అల్లు అర్జున్ పుష్ఫ సినిమాతో బీజీగా ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా పుష్ఫ టీజర్ విడుదల అయింది. ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్‌గా విడుదలైన ఈ టీజర్‌లో బన్నీ ఊరమాస్ గెటప్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాడు. బన్నీ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక్కరోజు ముందుగానే టీజర్ విడుదల చేసింది మూవీ టీం. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై తాజా టీజర్‌తో ఫుల్ బజ్ ఏర్పడింది.

ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13న థియేటర్లకు రానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories