AA23: షూటింగ్ మొదలు కాకముందే రికార్డుల వేట మొదలుపెట్టిన అల్లు అర్జున్ కొత్త సినిమా

AA23
x

AA23: షూటింగ్ మొదలు కాకముందే రికార్డుల వేట మొదలుపెట్టిన అల్లు అర్జున్ కొత్త సినిమా

Highlights

AA23: సాధారణంగా ఒక సినిమా విడుదలైన తర్వాతో లేదా టీజర్ వచ్చిన తర్వాతో రికార్డులు సృష్టించడం మనం చూస్తుంటాం.

AA23: సాధారణంగా ఒక సినిమా విడుదలైన తర్వాతో లేదా టీజర్ వచ్చిన తర్వాతో రికార్డులు సృష్టించడం మనం చూస్తుంటాం. కానీ, అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ సినిమా మాత్రం ఇందుకు భిన్నం. కేవలం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే 3.55 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సాధించి, భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది.

ఈ క్రేజ్‌కు ప్రధాన కారణం సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఆ పవర్‌ఫుల్ మ్యూజిక్ వింటుంటే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వస్తుండటంతో, ప్రతి ఒక్కరూ ఆ ఆడియోను వాడుతూ రీల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ అరుదైన రికార్డును అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ సందడి రెట్టింపు అయ్యింది.

'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ లోకేష్ కనగరాజ్ చేతిలో పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే అభిమానులకు రెండు కళ్లు సరిపోవడం లేదు. లోకేష్ మార్క్ డార్క్ షేడ్స్‌లో బన్నీ మేనరిజమ్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్.

లోకేష్ కనగరాజ్ తన సినిమాలన్నింటినీ ఒకదానికొకటి లింక్ చేస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) సృష్టిస్తున్నారు. మరి AA23 కూడా అందులో భాగమేనా? లేక ఇదొక సరికొత్త సైన్స్ ఫిక్షన్ కథా? అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన లోకేష్, స్టైల్ కింగ్ అల్లు అర్జున్‌ను ఏ రేంజ్‌లో ప్రెజెంట్ చేస్తారో అని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.

కేవలం అనౌన్స్‌మెంట్ వీడియోకే ఈ స్థాయి రెస్పాన్స్ ఉంటే, రేపు టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక ఇక ఇంటర్నెట్ తట్టుకోవడం కష్టమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షూటింగ్ కూడా మొదలవ్వకుండానే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన #AA23, విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories