Allu Arjun: ఫాలోవర్స్ విషయంలో తగ్గేదే లే అంటున్న స్టైలిష్ స్టార్

* ఇంస్టాగ్రామ్ లో రికార్డులు సృష్టిస్తున్న అల్లు అర్జున్

admin1
Updated on: 31 Aug 2021 7:00 PM IST
Allu Arjun is The First South Indian Actor With 13 Million Followers in Instagram
X

అల్లు అర్జున్ (ట్విట్టర్ ఫోటో)

Allu Arjun: ఈ మధ్యనే "అల వైకుంఠపురంలో" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం లో "పుష్ప" సినిమాతో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిగతా హీరోలతో పోల్చుకుంటే అల్లు అర్జున్ కు మిగతా భాషల నుండి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా మలయాళ ప్రేక్షకులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫాలోవర్ ల జాబితా పెంచుకుంటూ పోతున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా రికార్డును సృష్టించాడు.

ఇంస్టాగ్రామ్ లో 13 మిలియన్ ఫాలోవర్లను నమోదు చేసుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ మేల్ యాక్టర్ గా అల్లు అర్జున్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అల్లు అర్జున్ తర్వాత ఇన్స్టా లో ఎక్కువ ఫాలోవర్లతో రెండవ స్థానం గెలుచుకున్న హీరో మన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. మహేష్ బాబు 7.1 మిలియన్ ఫాలోవర్లతో అందరినీ ఆకట్టుకుంటుండగా 6.9 మిలియన్ తో ప్రభాస్ ఉన్నారు. చిరంజీవి 1.5 మిలియన్ ఫాలోవర్లను నమోదు చేసుకోగా ఎన్టీఆర్ కి 2.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

admin1

admin1

Next Story