అల్లు అర్జున్ పాట కోసం సర్జరీ వాయిదా వేసుకున్న కొరియోగ్రాఫర్

Allu Arjun: "ఊ అంటావా ఊ ఊ అంటావా" పాట అందుకే హిట్ అయింది అంటున్న కొరియోగ్రాఫర్.

admin1
Updated on: 5 Feb 2022 8:51 AM IST
Allu Arjun Is The Choreographer Who PostPoned The Surgery For The Song
X

అల్లు అర్జున్ పాట కోసం సర్జరీ వాయిదా వేసుకున్న కొరియోగ్రాఫర్

Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా ఈ మధ్యనే బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో విడుదలైన సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్ లాగానే మారాయి. ముఖ్యంగా "ఊ అంటావా ఊ ఊ అంటావా" పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పాటలో అల్లు అర్జున్ మరియు సమంత ల డాన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా బాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకి కొరియోగ్రఫీ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాట గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు ఆచార్య.

"సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవ్వాలి. అల్లు అర్జున్ నాకు డిసెంబర్ 2 ఆర్ 3 న కాల్ చేసి ఒక పాట చేయాలి అని అడిగారు. కానీ చాలా తక్కువ సమయం ఉంది, పైగా నాకు రేపు కేటరాక్ట్ సర్జరీ కూడా ఉందని చెప్పాను. అప్పుడు సినిమా నిర్మాతలు మా డాక్టర్ తో మాట్లాడి సర్జరీని వాయిదా వేశారు. రెండు రోజులు రిహార్సిల్స్ చేసి వెంటనే షూటింగ్ మొదలుపెట్టాం," అని చెప్పుకొచ్చారు గణేష్ ఆచార్య. సెన్సువాలిటీని చూపించాలంటే చాలానే దారులు ఉంటాయి. ఎక్స్పోజింగ్ అందులో ఒకటే అని నేను నమ్మను. ఆటిట్యూడ్ తో కూడా సెన్సువాలిటీని చూపించవచ్చు. ఆ ఆటిట్యూడ్ అల్లు అర్జున్ మరియు సమంత చూపించారు కాబట్టే పాట హిట్ అయింది అని అన్నారు గణేష్.

admin1

admin1

Next Story