Allu Arjun: చావు కబురు చల్లగా ఈవెంట్‌లో మెరవనున్న స్టైలిష్ స్టార్

Allu Arjun: యంగ్ హీరో కార్తికేయ తాజాగా నటించిన 'చావు కబురు చల్లగా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగనుంది.

Venkata Chari
Published on: 9 March 2021 3:49 PM IST
Allu Arjun is the Chief Guest for the Pre Release Event of Chaavu Kaburu Challaga Movie
X

చావు కబురు చల్లగా పోస్టర్ (ఫొటో ట్విట్టర్)

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ హీరో కార్తికేయ తాజాగా నటించిన 'చావు కబురు చల్లగా' సినిమాకు సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో పలు చిన్న సినిమాలకు అనేక మార్లు సపోర్ట్ అందించాడు స్టైలిష్ స్టార్. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ రోజు (మంగళవారం) సాయంత్రం గం. 5:30లకు జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్లో జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకకు ఛీప్ గెస్టుగా అల్లు అర్జున్ హాజరవనున్నాడు. కాగా సినిమా నిర్మాత బన్నివాస్‌ అల్లు అర్జున్‌కు ఇష్టమైన మిత్రుడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే బన్నీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు రానున్నట్లు టాక్‌. మార్చి 19న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈసినిమాపై యంగ్ హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఆశపడుతున్నారు.

కాగా, సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అల్లు అర్జున్ రాకతో సినిమా స్థాయి ఖచ్చితంగా పెరుగుతుందని టీం యూనిట్ భావిస్తుంది.

Venkata Chari

Venkata Chari

Next Story