Aha: స్టార్ హీరోతో కాఫీ విత్ కరణ్ లాంటి షో ప్లాన్ చేస్తున్న ఆహా

Aha: ఆహా లో టాక్ షో ప్లాన్ చేయబోతున్న స్టార్ హీరో

admin1
Published on: 21 Jan 2022 1:10 PM IST
Allu Arjun is planning a hosting  Show in Aha
X

ఆహా లో టాక్ షో ప్లాన్ చేయబోతున్న స్టార్ హీరో

Talk Show in Aha: ఈమధ్య కాలంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందులోనూ అల్లు అరవింద్ లాంచ్ చేసిన ఆహా ఓటీటీకి ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబర్లు బాగానే పెరిగారు. "సామ్ జామ్" వంటి షో లతో సూపర్ హిట్స్ ఇన్ మలయాళం సినిమాలు తెలుగులో డబ్ చేస్తూ మంచి మంచి సినిమాలు విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆహా. సమంత, బాలకృష్ణ, మంచు లక్ష్మీ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఆహ లో సెలబ్రిటీ షోలు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరొక స్టార్ ఆహా లో షో చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆ స్టార్ మరెవరో కాదు అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్. కాఫీ విత్ కరణ్ లాగా తెలుగులో కొంతమంది సెలబ్రిటీలతో ఒక టాక్ షో ప్లాన్ చేస్తోంది ఆహా. దీనికి అల్లు అర్జున్ హోస్ట్గా వ్యవహరిస్తే బాగుంటుంది అని వారి అభిప్రాయం. బాలీవుడ్ లో చాలా పాపులర్ అయిన కాఫీ విత్ కరణ్ ఇప్పటికే చాలా సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులో ఇలాంటి షో ఇప్పటిదాకా లేదు. ఒకవేళ నిజంగానే ఇలాంటి షో తెలుగులో వస్తే దానికి అల్లుఅర్జున్ హోస్ట్ గా మారితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పచ్చు. మరి ఈ పుకార్లలో నిజమెంత ఉందో ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story