Allu Arjun: బన్నీ నెక్ట్స్‌ మూవీ ఏంటో తెలుసా.? హిట్‌ కాంబినేషన్‌

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్‌ మూవీ ఏంటన్నదానిపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Sept 2024 3:37 PM IST
Allu Arjun is Going to Act in Trivikram Movie, Know Details Here
X

Allu Arjun: బన్నీ నెక్ట్స్‌ మూవీ ఏంటో తెలుసా.? హిట్‌ కాంబినేషన్‌

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్‌ మూవీ ఏంటన్నదానిపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. పుష్ప విడుదలైన సుమారు మూడేళ్లు గడుస్తోన్నా బన్నీ మళ్లీ వెండితెరపై కనిపించలేదు. పుష్పతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్‌ 6వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో బన్నీ తర్వాతి సినిమా ఏంటన్నదానిపై ఆసక్తి నెలకొంది. పుష్ప చిత్రీకరణ చివరి స్టేజ్‌లో ఉన్న నేపథ్యంలో.. బన్నీ తర్వాతి చిత్రం ఏంటన్నదానిపై చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు బన్నీ తర్వాతి చిత్రం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జవాన్‌ తర్వాత అట్లీ ఓ భారీ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్లాన్‌ చేశాడని అందులో బన్నీని హీరోగా తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. బన్నీ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప2 పూర్తయిన వెంటనే బన్నీ-త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మరోసారి ఇలాంటి హిట్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌ భారీ కాన్వాస్‌ ఉన్న కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story