Pushpa Teaser: పుష్ప మూవీ నుంచి ఫస్ట్ వీడియో రిలీజ్

Pushpa Teaser: పుష్ప సినిమా నుంచి ఫస్ట్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Kranthi
Updated on: 3 April 2021 1:05 PM IST
Pushpa Allu Arjun Introduction as Pushparaj in Telugu Released | Pushpa Teaser
X

Pushparaj Introduction 

Pushpa Teaser: విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ హీరోగా వస్తోన్న మూవీ పుష్ప. అడవి బ్యాక్ డ్రాప్, ఎర్రచందనం కథంశంతో తెరకెక్కుతున్న పుష్ప మూవీ నుంచి ఇప్పటి వరకు పిక్స్ మాత్రమే వచ్చాయి.. ఇప్పుడు వీడియోను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్.. గిరిజన గూడెం యువతిగా రష్మిక యాక్ట్ చేస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక వీడియో బిట్ ను వదిలారు. వెనక్కి విరిచి తాళ్లతో కట్టేయబడిన చేతులతో 'పుష్పరాజ్' పారిపోతూ తనని తరుముకొచ్చే వాళ్లు ఎంత దూరంలో ఉన్నారన్నది అంచనా వేస్తూ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పుష్ప ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే విషయం ఈ ఒక్క షాట్ ను బట్టే తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన బన్నీ బర్త్ డే కావడం వలన, ఫ్యాన్స్ కోసం ముందురోజునే ట్రీట్ ఇస్తున్నారు చిత్రం యూనిట్. ఇక హీరోని ఎవరు ఎందుకు బంధించారు? అనే ఆసక్తిని ఈ వీడియో రేకెత్తిస్తోంది. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 6:12 నిమిషాలకు పుష్ప రాజ్ ను పరిచయం చేస్తామని ఈ వీడియో చివర్లో చెప్పారు. అంటే ఆ రోజున మరో వీడియోను వదలనున్నారని తెలుస్తోంది.


Kranthi

Kranthi

Next Story