మరొక సినిమా లైన్లో పెట్టిన బన్నీ

Ruthvik
Published on: 30 March 2019 10:39 AM IST
మరొక సినిమా లైన్లో పెట్టిన బన్నీ
X

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో డిజాస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు కానీ ఈ లోపు బన్నీ వరుసపెట్టి సినిమాలు లైన్లో పెట్టేస్తున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా తరువాత బన్నీ తరువాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని ఈమధ్యనే ప్రకటన వచ్చింది. ఇది జరిగి నెల అయినా అయ్యిందో లేదో అప్పుడే మరొక ప్రొజెక్ట్ లైన్లో పెట్టాడు బన్నీ.తాజా సమాచారం ప్రకారం వేణు శ్రీరామ్ ఒక ఆసక్తికరమైన సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఒక ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ తయారు చేసి బన్నీ కి వినిపించాడాని, స్క్రిప్ట్ నచ్చడంతో బన్నీ వెంటనే ఒప్పుకున్నాడని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓహ్ మై ఫ్రెండ్', 'ఎంసీఏ' చిత్రాల్ని నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Ruthvik

Ruthvik

Next Story