Allu Arjun: అందుకే "ఐకాన్" వద్దని బోయపాటికి ఓటేసిన బన్నీ

Allu Arjun: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ని పక్కకు పెట్టిన అల్లు అర్జున్

admin1
Updated on: 27 Oct 2021 9:30 PM IST
Allu Arjun Going to Do His Next Film With Boyapati Srinu
X

బోయపాటి సినిమాను ఓకే చేయనున్న అల్లు అర్జున్ (ఫైల్ ఇమేజ్)

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప: ది రైజ్" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ నెలాఖరులో మొదలవనుంది. అక్టోబర్ పూర్తయ్యే లోపల ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్" సినిమా చేయాల్సి ఉంది. కానీ బన్నీ ఈ సినిమాని పక్కన పక్కకుపెట్టి బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. నిజానికి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్" సినిమా ఓకే అయినప్పటి నుంచి షూటింగ్ విషయంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం ఒక కమర్షియల్ సినిమా కథని తీసుకువచ్చి ఇంప్రెస్ చేశారట. "పుష్ప" వంటి రా సినిమా తర్వాత ఇలాంటి కమర్షియల్ సినిమా చేస్తే బాగుంటుందని అల్లు అర్జున్ కూడా ఈ సినిమాని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు శ్రీరామ్ మాత్రం అల్లు అర్జున్ తో తన సినిమాని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. మరోవైపు "పుష్ప: ది రైజ్" సినిమా డిసెంబర్ లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story