Allu Arha: నాన్నకు వెరైటీగా స్వాగతం పలికిన అల్లు అర్హ.. మురిసిపోయిన స్టైలిష్‌ స్టార్‌..

Allu Arha: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే 'పుష్ప' సినిమాతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

admin1
Published on: 29 Jan 2022 8:32 PM IST
Allu Arjun Gets The Sweetest Welcome From Daughter Arha
X

Allu Arha: నాన్నకు వెరైటీగా స్వాగతం పలికిన అల్లు అర్హ.. మురిసిపోయిన స్టైలిష్‌ స్టార్‌..

Allu Arha: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే 'పుష్ప' సినిమాతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే 'పుష్ప' షూటింగ్తో బిజీబిజీగా గడిపిన అల్లు అర్జున్ సినిమా విడుదలై సూపర్ హిట్ అవడమ్ తో దుబాయ్ కి వెకేషన్ కి వెళ్లారు. ఈ నేపథ్యంలో కుటుంబానికి రెండు వారాలపాటు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా తన ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ కు తన కూతురు అల్లు అర్హ నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొని మురిసిపోతున్నారు స్టైలిష్ స్టార్.

తన తండ్రి వస్తున్నాడు అని తెలుసుకున్న అల్లు అర్హ పూరేకులతో 'వెల్కమ్ నాన్న' అని గుమ్మం ముందు రాసి అల్లు అర్జున్ కు స్వాగతం పలికింది. "పదహారు రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. అల్లు అర్హ చెప్పిన స్వాగతం చాలా సంతోషాన్నిచ్చింది" అంటూ ఆ ఫోటో ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు అల్లు అర్జున్. ఇక సినిమాల పరంగా చూస్తే 'పుష్ప: ది రూల్' అతి త్వరలో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దసరా లేక డిసెంబర్ కి విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


admin1

admin1

Next Story