Allu Arjun: రికార్డుల బదులు థియేటర్ బద్దలు కొట్టేసిన అల్లు అర్జున్ అభిమానులు

Allu Arjun: రీ రిలీజ్ సెలబ్రేషన్స్ పేరుతో థియేటర్ స్క్రీన్ ధ్వంసం చేసిన ఫ్యాన్స్..

Dhatripriya
Published on: 7 April 2023 12:53 PM IST
Allu Arjun Fans Broke Theater Instead Of Records
X

Allu Arjun: రికార్డుల బదులు థియేటర్ బద్దలు కొట్టేసిన అల్లు అర్జున్ అభిమానులు

Allu Arjun: గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరో ల సినిమాలు ఈ మధ్య మళ్లీ రీ రిలీజ్ అయ్యి థియేటర్ లలో రికార్డులు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. నిన్న కాక మొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన "ఆరెంజ్" సినిమా రీ రిలీజ్ అయ్యి ఓ రేంజి లో కలెక్షన్లు కురిపించి రికార్డులు సృష్టించింది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "దేశ ముదురు" సినిమా ఈ మధ్యనే రీ రిలీజ్ అయ్యింది.

అల్లు అర్జున్‌ బర్త్‌డే(ఏప్రిల్‌ 8) సందర్భంగా బర్త్‌డేకు రెండు రోజుల ముందే ఏప్రిల్‌ 6న గ్రాండ్‌గా దేశముదురును రీరిలీజ్‌ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో హన్సిక హీరోయిన్ గా నటించింది. అప్పుడు సూపర్ హిట్ అయిన ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా మంచి కలెక్షన్లు అందుకుంది. అయితే రికార్డులు బద్దలు కొట్టడం పక్కన పెడితే, సినిమా రీ రిలీజ్ అయ్యింది అనే సంతోషం లో సెలబ్రేషన్స్ పేరుతో అభిమానులు థియేటర్ స్క్రీన్ ని ధ్వంసం చేసేసారు.

అభిమాన హీరో సినిమా రన్ అవుతున్న సమయంలో అభిమానులు ఈలలు వేస్తూ గోల చేయడం చాలా సహజం. కానీ ఇప్పుడు ఆ అల్లర్లు శ్రుతి తప్పి థియేటర్ అధికారులకు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టాయి. హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ సంధ్య 70 ఎంఎం లో దేశముదురు సినిమా ప్లే అవుతున్న సమయంలో అభిమానులు స్క్రీన్ ధ్వంసం చేసేసారు. అంతటితో ఆగకుండా పేపర్లు చింపుతూ థియేటర్‌ లోపలే టపాసులు పేల్చారు. నిజానికి ఇలా సెలబ్రేషన్స్ మరియు అల్లర్లు చేస్తూ చాలా మంది అభిమానులు థియేటర్ లలో కుర్చీలు విరగోట్టారు. అందుకే చాలా మంది థియేటర్ అధికారులు ఇలా ఫ్యాన్ షో లు వేయడానికి భయపడతారు.

Dhatripriya

Dhatripriya

Next Story