Allu Arjun: రీ రిలీజ్ విషయంలో అల్లు అర్జున్ పీ ఆర్ ని టార్గెట్ చేస్తున్న ఫాన్స్

Allu Arjun: రిలీజ్ విషయంలో అల్లు అర్జున్ పీ ఆర్ ని టార్గెట్ చేస్తున్న ఫాన్స్

Dhatripriya
Updated on: 27 March 2023 8:30 PM IST
Allu Arjun Fans Are Criticizing PR Team
X

Allu Arjun: అల్లు అర్జున్ పీ ఆర్ ని తిట్టిపోస్తున్న అభిమానులు..

Allu Arjun: ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ల ట్రెండు టాలీవుడ్ లో బాగా కనిపిస్తోంది. సీనియర్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలామంది హీరోల సూపర్ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్ల లో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా ఇప్పటిదాకా రీ రిలీజ్ అవ్వలేదు. దీంతో అల్లు అభిమానులు అల్లు అర్జున్ పీ ఆర్ టీం పై మండిపడుతున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ల సినిమాలు ఇప్పటికే కొన్ని రీ రిలీజ్ అయ్యాయి. ఆఖరికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు కూడా మళ్లీ రిలీజ్ అయ్యాయి.

ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా "దేశ ముదురు" సినిమాని రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని అల్లు అర్జున్ పి ఆర్ టీం ప్రకటించింది. కానీ ఇప్పటిదాకా దీనికి సంబంధించిన మరే అప్డేట్ బయటకు రాలేదు. ఇక సమయం దగ్గర పడుతూ ఉండటంతో అభిమానులు ఈ విషయంలో నిరాశ చెందుతున్నారు. ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వనందుకు పీ ఆర్ టీం ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

ఏప్రిల్ 7 న 3 కొత్త సినిమా రిలీజ్ లు ఉన్నాయని ఆ సమయంలో ఏప్రిల్ 8న షోలకి థియేటర్లు దొరకటం అంత ఈజీ కాదని పీ ఆర్ టీం జవాబు ఇస్తోంది. అల్లు అర్జున్ ఖాతాలో కూడా బోలెడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. రీ రిలీజ్ చేస్తే మంచి సూపర్ హిట్ లు అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ పీ ఆర్ టీం మాత్రం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ సినిమా రిలీజ్ గురించి మాట్లాడకపోవడంతో అభిమానులు బాగా నిరాశ హార్ట్ అవుతున్నారు. మరి అల్లు అర్జున్ సినిమా ఎప్పటికీ రిలీజ్ అవుతుందో చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story