Allu Arjun-Vishwak Sen: విశ్వక్ సేన్ కోసం దేవుడి గా మారనున్న అల్లు అర్జున్

Allu Arjun Extended Cameo in Remake of Oh My Kadavule with Vishwak Sen
x

 విశ్వక్ సేన్ కోసం దేవుడి గా మారనున్న అల్లు అర్జున్

Highlights

Allu Arjun-Vishwak Sen: తమిళంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన "ఓ మై కడవులే" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Allu Arjun-Vishwak Sen: తమిళంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన "ఓ మై కడవులే" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫాంటసీ ఎలమెంట్లు జోడించిన ఒక అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళం లో అతి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో రీమేక్ చేయబడుతోంది. "హిట్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ మరియు మిథిలా పాల్కర్ లు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. పీవీపీ సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తమిళ వెర్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి దేవుడి పాత్ర లో కనిపించారు. మరి తెలుగులో ఆ పాత్ర ఎవరు పోషించనున్నారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి సినిమా లో ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు గుసగుస లాడుతున్నాయి. మరి ఇప్పటికే రుద్రమదేవి సినిమాలో క్యామియో పాత్రలో మెప్పించిన అల్లు అర్జున్ ఈ సినిమాలో కూడా క్యానియో పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కానీ ఆ పుకార్లు లో నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories